పవన్ కల్యాణ్ తో భేటీ అయిన మంచు మనోజ్

14-10-2021 Thu 21:14
  • 'భీమ్లా నాయక్' షూటింగ్ స్పాట్ కు వెళ్లిన మనోజ్
  • గంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు
  • పవన్ ను కలవడం ఎప్పుడూ సంతోషకరమే అన్న మనోజ్
Manchu Manoj meets Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ తో సినీ నటుడు మంచు మనోజ్ భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ లొకేషన్లో ఈ సాయంత్రం పవన్ ను మనోజ్ కలిశారు.

సుమారు గంటకు పైగా వీరిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. పలు విషయాలపై చర్చించారు. పవన్ అంటే మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మనోజ్ పట్ల పవన్ స్నేహపూర్వకంగా ఉంటారు. వీరి చర్చల్లో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిణామాల ప్రస్తావన కూడా వచ్చింది.

పవన్ తో భేటీ గురించి మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'పవర్ స్టార్ ని కలవడం ఎంతో పవర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్' అని మనోజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయనను కలవడం ఎప్పుడూ సంతోషకరమేనని చెప్పారు. మనస్పూర్తిగా తనతో మాట్లాడారని తెలిపారు. 'నాపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అన్నా' అంటూ పేర్కొన్నారు.