ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన పనులేవీ జగన్ చేయడం లేదు: యనమల

14-10-2021 Thu 20:49
  • రాష్ట్రంలో అభివృద్ధి నిల్... అప్పులు ఫుల్ 
  • జగన్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు
  • రాష్ట్రాన్ని జగన్ అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారు 
Money found in Hetero Drugs by IT officers is Jagans says Yanamala

ముఖ్యమంత్రి జగన్ ఏపీని అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి నిల్... అప్పులు ఫుల్ అని ఎద్దేవా చేశారు. జగన్ తీరు వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.  

ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన పనులేవీ జగన్ చేయడం లేదని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో టీడీపీ నూతన కార్యాలయానికి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యనమల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.