ఈ నెల 16న 'నాట్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథిగా చరణ్!

14-10-2021 Thu 18:49
  • నాట్య ప్రధానంగా సాగే కథ
  • ప్రధాన పాత్రధారిగా సంధ్యరాజు
  • కీలకమైన పాత్రలో భానుప్రియ
  • ఈ నెల 22వ తేదీన విడుదల  
Natyam movie update

సంధ్యరాజు మంచి కూచిపూడి నృత్య కళాకారిణి. నాట్యంపై తనకి గల అభిమానంతో ఆమె నాట్యం ప్రధానంగా సాగే ఒక కథను ఎంచుకున్నారు. ఈ సినిమా కోసం ఆమె నటన వైపు అడుగులు వేయడమే కాకుండా నిర్మాతగాను మారారు. ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు మరో భాగస్వామిగా ఉన్నారు.

రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ ఆకట్టుకుంది. స్టార్ హీరోలచే టీజర్లు .. ట్రైలర్లు .. పాటలు రిలీజ్ చేయిస్తూ, సినిమాకి ఒక రేంజ్ లో బజ్ తీసుకుని వచ్చారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - శిల్పకళావేదికలో ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ ఈవెంట్ కి చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం..