బాలీవుడ్లో చేసే ఆలోచన లేదు: అఖిల్

14-10-2021 Thu 18:27
  • కథ వినగానే నచ్చేసింది 
  • 10 రోజుల పాటు  ఆలోచన చేశాను 
  • పూజ చాలా కష్టపడుతుంది 
  • 'ఏజెంట్' మూవీ సమ్మర్ కి రావచ్చు
Most Eligible Bachelor movie update

అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, విజయదశమి సందర్భంగా రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అఖిల్ మాట్లాడాడు.

"సింగిల్ సిట్టింగ్ లోనే నాకు కథ నచ్చింది .. అయినా ఒక పది రోజులు ఆలోచించిన తరువాతనే ఓకే చెప్పాను. పెళ్లికి ముందు ఎలా ఉండాలి? పెళ్లి తరువాత ఎలా నడుచుకోవాలి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా చూసిన తరువాత చాలామంది తమ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని అనుకుంటారు. అంతగా ఈ సినిమాలోని మెసేజ్ వాళ్లకి కనెక్ట్ అవుతుంది. ఇక పూజ హెగ్డే పనితీరును చూసిన తరువాత సక్సెస్ అనేది ఊరికినే రాదనే విషయం నాకు అర్థమైంది.

నేను తెలుగువాడిని .. ఇక్కడి సినిమాలే చేయాలనుకుంటున్నాను. బాలీవుడ్ కి వెళ్లాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం 'ఏజెంట్' సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎంతవరకూ ఉంటుందో చూడాలి" అని చెప్పుకొచ్చాడు.