Amit Shah: సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో సమాధానం చెపుతాం: పాకిస్థాన్ కు అమిత్ షా హెచ్చరిక

  • కూర్చొని చర్చలు జరిపే రోజులు పోయాయి
  • ఇప్పుడున్నవి దీటుగా సమాధానం చెప్పే రోజులు
  • సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా సరిహద్దులకు ఎవరూ హాని కలిగించలేరనే సందేశాన్ని పంపాం
We will reply with surgical strikes Amit Shah warns Pakistan

జమ్మూకశ్మీర్ లో పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ ఐడీ కార్డులను తనిఖీ చేసి ఉగ్రవాదులు చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో మళ్లీ సమాధానం చెపుతామని హెచ్చరించారు.

హాని తలపెట్టే వారితో కూర్చొని చర్చలు జరిపే రోజులు గతంలో ఉండేవని... ఇప్పుడున్నవి ఉగ్రదాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని అన్నారు. 2016లో భారత ప్రభుత్వం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ను ఆయన గుర్తు చేశారు. గోవాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో పాకిస్థాన్ గడ్డపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని అమిత్ షా చెప్పారు. ఈ దాడుల ద్వారా భారత సరిహద్దులకు ఎవరూ హాని కలిగించలేరనే సందేశాన్ని పంపామని అన్నారు. ఇప్పుడు చర్చలు జరిపే సంప్రదాయం లేదని... తిరిగి ఇవ్వడమే అని చెప్పారు.

More Telugu News