మంత్రి తలసానిని కలిసిన మంచు విష్ణు

14-10-2021 Thu 17:27
  • తలసానిని మర్యాదపూర్వకంగా కలిసిన విష్ణు, శివబాలాజీ
  • 'మా' నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన విష్ణు
  • ఈ ఉదయం బాలయ్యను కలిసిన విష్ణు, మోహన్ బాబు
Manchu Vishnu meets Talasani Srinivas Yadav

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, ట్రెజరర్ శివబాలాజీ కలిశారు. మర్యాదపూర్వకంగా మంత్రిని వారు కలిశారు. ఈ నెల 16న జరగనున్న 'మా' నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. 'మా' అధ్యక్ష బాధ్యతలను విష్ణు ఇప్పటికే చేపట్టిన సంగతి తెలిసిందే. పెన్షన్స్ ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు సినీ ప్రముఖులను మంచు విష్ణు కలుస్తున్నారు. ఈ ఉదయం తన తండ్రి మోహన్ బాబుతో కలిసి బాలకృష్ణను కలిశారు. పరుచూరి బ్రదర్స్, కోట శ్రీనివాసరావు వంటి వారిని కూడా కలిశారు. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తానని చెప్పిన సంగతి సంగతి తెలిసిందే.