sense: ఈరోజు కూడా దూసుకుపోయిన మార్కెట్లు.. 61 వేల మార్కును దాటిన సెన్సెక్స్

  • 569 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 177 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ ఐటీసీ షేర్ వాల్యూ
Sensex crosses 61K mark

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. రేపు విజయదశమి, ఎల్లుండి శనివారం, ఆ తర్వాత ఆదివారం నేపథ్యంలో మార్కెట్లకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్న తరుణంలో... ఈరోజు కొనుగోళ్ల జోరు కొనసాగింది. ముఖ్యంగా టెక్నాలజీ స్టాకులు దూకుడు ప్రదర్శించాయి.

ఈ క్రమంలో మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయులను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 569 పాయింట్లు లాభపడి 61,306కి ఎగబాకింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 18,339కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.89%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.51%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.44%), ఎల్ అండ్ టీ (2.12%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.22%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.17%), బజాజ్ ఫైనాన్స్ (-0.85%), ఏసియన్ పెయింట్స్ (-0.75%), భారతి ఎయిర్ టెల్ (-0.58%).

More Telugu News