తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో 'పెళ్లి సంద‌D' హీరో, హీరోయిన్లు!

14-10-2021 Thu 13:29
  • రేపు పెళ్లి సంద‌డి విడుద‌ల‌
  • శ్రీ‌వారి ఆశీర్వాదం తీసుకున్నామ‌న్న సినీ యూనిట్
  • కుటుంబంతో క‌లిసి అంద‌రూ చూడ‌వ‌చ్చ‌ని గౌరీ రోణంకి వ్యాఖ్య‌
palli sandadi team visits ttd

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' రూపొందిన విష‌యం తెలిసిందే. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో హీరో రోష‌న్, హీరోయిన్ శ్రీ‌లీలతో పాటు సినిమా యూనిట్‌ తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా రోష‌న్ మీడియాతో మాట్లాడుతూ.. రేపు సినిమా విడుద‌ల‌వుతోన్న నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆశీర్వాదం కోసం వ‌చ్చామ‌ని చెప్పాడు. శ్రీ‌నివాసుడిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపాడు. సినిమా బృందం మొత్తం శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చింద‌ని శ్రీ‌లీల తెలిపింది. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అని, కుటుంబంతో క‌లిసి అంద‌రూ చూడ‌వ‌చ్చ‌ని దర్శకురాలు గౌరీ రోణంకి అన్నారు.