తండ్రితో కలిసి నంద‌మూరి బాల‌కృష్ణ‌ ఇంటికి వెళ్లిన మంచు విష్ణు

14-10-2021 Thu 12:36
  • బాల‌కృష్ణ ఆశీర్వాదం తీసుకోవ‌డానికి వచ్చాను
  • మా ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి బాలకృష్ణ స‌హ‌క‌రించారు
  • ఇప్ప‌టికే ప‌లువురిని క‌లిశాను
  • పెద్ద‌లు అంద‌రినీ క‌లుస్తాను  
vishnu meets balakrishna

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో హీరో మంచు విష్ణు గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ ఇంటికి వెళ్లాడు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బాల‌కృష్ణ ఆశీర్వాదం తీసుకోవ‌డానికి వచ్చాన‌ని అన్నాడు.

'మా' ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి బాలకృష్ణ స‌హ‌క‌రించారని మంచు విష్ణు తెలిపాడు. ఇప్ప‌టికే తాను కోట శ్రీ‌నివాస‌రావు, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కృష్ణంరాజు, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వారిని  క‌లిశానని చెప్పాడు. ఇప్పుడు బాల‌య్య‌ను క‌లిశాన‌ని వివ‌రించారు. పెద్ద‌లందర్నీ క‌లుస్తానని, అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ్తానని తెలిపాడు. కాగా, ఆయ‌న నిన్న 'మా' అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే.