'భీమ్లా నాయక్' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!

14-10-2021 Thu 11:35
  • షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
  • పవన్ సరసన నిత్యామీనన్
  • రానా జోడీగా సంయుక్త మీనన్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • జనవరి 12వ తేదీన విడుదల  
Bheemla Nayak song promo released

పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్లకు .. టైటిల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. దసరా పండగ సందర్భంగా, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. "అంత ఇష్టమేందయ్యా .. అంత ఇష్టమేందయ్యా .. నీకు .. నా మీనా" అంటూ ఈ పాట సాగుతోంది.

తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చిత్ర ఆలపించారు. పవన్ కల్యాణ్ - నిత్యామీనన్ లపై ఈ పాటను చిత్రీకరించారు. పూర్తి పాటను రేపు ఉదయం 10:09 నిమిషాలకు వదలనున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.