పండుగ రోజు సమంత కొత్త అప్ డేట్!

14-10-2021 Thu 11:33
  • మూడు ప్రాజెక్టులకు కమిట్ అయిందంటున్న ఫిల్మ్ నగర్ వర్గాలు
  • వాటి వివరాలు వెల్లడించే అవకాశం
  • గుణశేఖర్ ‘శాకుంతలం’ పూర్తి చేసిన సామ్
  • విజయ్ సేతుపతి, నయన్ లతో మల్టీస్టారర్
New Update From Samantha Likely Tomorrow

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అయితే, ఇప్పటిదాకా తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఆమె ఇవ్వలేదు. ఈ క్రమంలో రేపు దసరా రోజు ఆమె కొత్త అప్ డేట్స్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ డైరెక్షన్ లో రూపు దిద్దుకుంటున్న ‘శాకుంతలం’ మూవీని ఆమె పూర్తి చేసింది. మరోపక్క, విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి తమిళంలో ఓ మల్టీస్టారర్ లో నటిస్తోంది.

వాటితో పాటు మరో మూడు కొత్త ప్రాజెక్టులకు సమంత కమిట్ అయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఆమె రేపు దసరా పండుగనాడు వెల్లడిస్తుందని అంటున్నాయి. మరి ఆ అప్ డేట్స్ ఏంటి? సమంత కమిట్ అయిన ప్రాజెక్టులేంటో తెలియాలంటే ఆమె ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.