ఏం జరిగిందో అమ్మవారికే తెలియాలి: 'మా' ఎన్నిక‌ల‌పై న‌టి హేమ‌

14-10-2021 Thu 10:33
  • ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ద‌ర్శించుకున్న‌ హేమ
  • రాత్రి గెలిచాం, ఆ త‌ర్వాత‌ ఉదయం ఓడిపోయామ‌ని వ్యాఖ్య‌
  • ధైర్యం ఇవ్వాల‌ని అమ్మ‌వారిని కోరుకున్నాన‌న్న న‌టి
hema on maa results

ఇటీవ‌ల జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో తాము రాత్రి గెలిచామని, ఆ త‌ర్వాత‌ ఉదయం ఓడిపోయామ‌ని సినీ న‌టి హేమ వ్యాఖ్యానించింది. ఆ ఎన్నిక కౌంటింగ్‌లో ఏం జరిగిందో అమ్మవారికే తెలియాలని చమత్కరించింది.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ రోజు ఉద‌యం దుర్గమ్మను ద‌ర్శించుకున్న‌ హేమ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... దుర్గ‌మ్మ‌ను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. దసరా సంద‌ర్భంగా తాను ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పింది. త‌న‌కు  ధైర్యం ఇవ్వాల‌ని అమ్మవారిని కోరుకున్నానని హేమ తెలిపింది. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుంచి హేమ పోటీ చేసిన విష‌యం తెలిసిందే.