Chicken: ఏపీలో బ్రాయిలర్ కోళ్లకు అమాంతం తగ్గిన డిమాండ్.. పడిపోయిన ధర!

  • రూ. 135 ఉన్న కిలో కోడి ధర రూ. 112కు పడిపోయిన వైనం
  • నవరాత్రుల కారణంగా తగ్గిన చికెన్ వినియోగం
  • ఒకానొక దశలో కిలో చికెన్ రూ. 280
chicken rates dropped in andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో బ్రాయిలర్ కోళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. నవరాత్రుల ముందు వరకు రైతుల వద్ద కిలో కోడి ధర రూ. 135 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 112కు పడిపోయింది. కోడిమాంసం విక్రయాలు పడిపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌గా కిలో చికెన్ ధర రూ. 180కి తగ్గింది.

కాగా, కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా చికెన్ ధరలు కొండెక్కాయి. ఒకానొక దశలో రూ. 280 వరకు పలికింది. అయితే, దేవీ నవరాత్రుల నేపథ్యంలో చికెన్ వినియోగం ఒక్కసారిగా తగ్గింది. ఫలితంగా ధరలు పడిపోయాయి. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకు దాదాపు రూ. 1.2 లక్షలకు పైగా కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, పెనుగొండ, అత్తిలి తదితర ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఎక్కువగా ఉంది.

More Telugu News