Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం.. కారులో వెళుతున్న వ్యక్తిని బయటకు లాగి నరికి చంపిన దుండగులు

dreaded murder in hyderbads old city in daylight
  • చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు వెళుతుండగా ఘటన
  • కారును అడ్డగించి బయటకు లాగి దాడి
  • అందరూ చూస్తుండగానే ఘటన
హైదరాబాద్ పాతబస్తీలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళుతున్న వ్యక్తిని అడ్డగించిన వ్యక్తులు ఆపై అందులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి నడిరోడ్డుపైనే కత్తులతో దాడిచేశారు. విచక్షణ రహితంగా పొడించి చంపారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపైనే ఈ ఘటన జరిగింది.

హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Old City
Chandrayanagutta
Murder
Crime News

More Telugu News