సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-10-2021 Thu 07:25
  • బాలీవుడ్ ప్రాజక్టుకి ఓకే చెప్పిన సమంత 
  • 'పుష్ప' తర్వాత బోయపాటితోనే బన్నీ!
  • షూటింగ్ పూర్తయిన 'రౌడీ బాయ్స్'    
Samantha to announce her Hindi project on Vijaya Dashami

*  ఇటీవల నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న కథానాయిక సమంత ఇప్పుడు తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టనుంది. ఈ క్రమంలో తాజాగా ఓ హిందీ చిత్రాన్ని చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన వివరాలను రేపు విజయదశమి రోజున ప్రకటిస్తుందట. 
*  'సరైనోడు' వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో మరో సినిమా రానుంది. ప్రస్తుతం చేస్తున్న 'పుష్ప' చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటితోనే చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం 'అఖండ' పూర్తిచేస్తున్న బోయపాటి అది పూర్తి కాగానే ఈ ప్రాజక్టు చేబడతాడట.
*  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'రౌడీ బాయ్స్' చిత్రం షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. 'హుషారు' ఫేమ్ హర్ష కోనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.