రేపే రజనీ 'అన్నాత్తే' టీజర్ రిలీజ్!

13-10-2021 Wed 18:17
  • రజనీ, శివ కలయికలో 'అన్నాత్తే'
  • నవంబర్ 4వ తేదీన విడుదల
  • తెలుగులోను అదే టైటిల్
  • అందరిలో పెరుగుతున్న అంచనాలు
Annatthe teaser will release tomorrow

రజనీకాంత్ కథానాయకుడిగా, సన్ పిక్చర్స్ వారు 'అన్నాత్తే' సినిమాను నిర్మించారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, భారీ తారాగణం సందడి చేయనుంది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచుతున్నారు.

రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. తెలుగులోను ఈ సినిమాను అదే టైటిల్ తో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా ఈ సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి.

గతంలో రజనీ సరసన నాయికలుగా మెరిసి, విజయాలను అందుకున్న ఖుష్బూ .. మీనా .. నయనతార ఈ సినిమాలో నటించడం విశేషం. ఇక కీర్తి సురేశ్ ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆకర్షణ. జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ పాత్రలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళతాయని అంటున్నారు.