శ్రియ ప్రెగ్నెన్సీపై మంచు లక్ష్మి స్పందన

13-10-2021 Wed 17:56
  • ఇటీవలే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ
  • శుభాకాంక్షలు తెలియజేసిన మంచు లక్ష్మి
  • ఆడ బిడ్డకు జన్మనివ్వడం గొప్ప విషయమని వ్యాఖ్య
Manchu Lakshmi response on Shriya pregnancy

సినీ నటి శ్రియ తల్లి అయిన సంగతి తెలిసిందే. ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గత నెలలో బిడ్డకు జన్మనిచ్చానని, ఆమెకు రాధ అని పేరు పెట్టుకున్నామని వెల్లడించింది. అయితే ఆమె గర్భవతి అయిన సంగతిని మాత్రం ఎప్పుడూ చెప్పకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందిస్తూ... ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నానంటూ శ్రియకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయమని చెప్పారు. గర్భవతివి అయ్యావని ప్రపంచానికి తెలియజేయడం అనేది నీ వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు. నీకు భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు.