'ఆచార్య' నుండి పూజ హెగ్డే లుక్

13-10-2021 Wed 15:49
  • చిరంజీవి, కాజల్, పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం
  • ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
  • పూజ బర్త్ డే సందర్భంగా లుక్ విడుదల
Pooja Hegde look in Acharya movie released

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల అవనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు ఈ సినిమాలో కథానాయికలుగా మెరవబోతున్నారు.

ఇదిలావుంచితే, నేడు పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లంగా, ఓణిలో అచ్చ తెలుగు అమ్మాయిలా పూజ ఎంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.