Atchannaidu: సోఫా నుంచి కింద పడిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు.. వీడియో ఇదిగో!

Atchannaidu and Rammohan Naidu felldown
  • గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు హాజరైన అచ్చెన్న, రామ్మోహన్
  • రామ్మోహన్ కూర్చున్న సోఫాలో కూర్చోబోయిన అచ్చెన్న
  • కింద పడిన ఇద్దరినీ లేవనెత్తిన నిర్వాహకులు
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. వేదికపైకి అచ్చెన్నాయుడు వచ్చారు. రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో కూర్చోబోతుండగా సోఫా విరిగి వెనక్కి పడిపోయింది. దీంతో అచ్చెన్న, రామ్మోహన్ నాయుడులు కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని లేవనెత్తారు. వారి కోసం మరో సోఫా వేసి కూర్చోబెట్టారు.
Atchannaidu
Rammohan Naidu
Telugudesam

More Telugu News