విరాట్ కోహ్లీ బయోపిక్.. నటించేందుకు సిద్ధమన్న అఖిల్

13-10-2021 Wed 13:15
  • ఎంతో మంది జీవితాలను కోహ్లీ ప్రభావితం చేశాడు 
  • ఆ కథాంశం చాలా అగ్రెసివ్ గా ఉంటుంది  
  • క్రీడా ప్రాధాన్య సినిమాలకు బాగా సూట్ అవుతానన్న అఖిల్ 
Akhil Says He is most Awaited Of Kohli Biopic

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు ఇప్పటికీ సరైన సక్సెస్ రాలేదు. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు అఖిల్. ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు, మున్ముందు చేయాలనుకుంటున్న ప్రాజెక్టుల గురించి తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు.

క్రీడల బ్యాగ్రౌండ్ తో తీసే సినిమాల్లో నటించాలని ఉందన్నాడు. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ జీవితంపై తెరకెక్కుతున్న ‘83’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో రూపొందే బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. క్రీడాకారుల కథలకు తాను బాగా సెట్ అవుతానన్నాడు.

ఎంతో మంది జీవితాలను విరాట్ కోహ్లీ ప్రభావితం చేశాడని, అతడి బయోపిక్ తీస్తే బాగుంటుందని చెప్పాడు. క్రికెట్ మీద అతడికున్న ప్యాషన్ తో సినిమా తీస్తే కథాంశం చాలా అగ్రెసివ్ గా ఉంటుందని, నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ తిరుగులేని కథగా నిలబడుతుందన్నాడు.