West Godavari District: తన చావుకు నలుగురు కారణమంటూ ఫోనులో రికార్డు చేసి.. డాబా పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
- పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మాదివాడలో ఘటన
- తన కోడలి కుటుంబ సభ్యులతో గొడవలు
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
తన చావుకు నలుగురు కారణమంటూ ఫోనులో రికార్డు చేసిన ఓ మహిళ డాబా పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మాదివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు నాగమణి అని స్థానికులు తెలిపారు.
తన కోడలి కుటుంబ సభ్యులతో జరుగుతోన్న గొడవల కారణంగానే నాగమణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, నాగమణి మాట్లాడిన ఫోను రికార్డును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.