'మహా సముద్రం' నుంచి మరో సాంగ్!

13-10-2021 Wed 11:29
  • సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్
  • భాస్కరభట్ల అందించిన సాహిత్యం
  • పాటలకు లభించిన మంచి రెస్పాన్స్
  • రేపే ప్రేక్షకుల ముందుకు సినిమా
Maha Samudram song promo released

శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా 'మహా సముద్రం' రూపొందింది. సముద్రం సాక్షిగా అల్లుకున్న స్నేహం - ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

'గొడవలే రానీ .. ' అంటూ ఈ పాట సాగుతోంది. నిన్ను మించిన తోపు ఎవరూ లేరిక్కడ .. భయపడితే బతకలేవు  .. ఏ విషయమైనా ఎక్కడికక్కడే తేల్చేయ్' అనే అర్థంలో ఈ పాట సాగుతోంది. చైతన్ భరద్వాజ్ బాణీకి భాస్కరభట్ల అందించిన ఈ పాటను శర్వానంద్ - సిద్ధార్థ్ లపై చిత్రీకరించారు.

లైఫ్ ను తమదైన స్టైల్లో ఎంజాయ్ చేస్తూ .. తమకి అడ్డొచ్చిన రౌడీల పని పడుతూ వాళ్లు దూసుకెళ్లడమనే విజువల్స్ పై ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని అజయ్ భూపతి వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.