'మహా' పాత్ర కోసం సమంతను అనుకున్నాను: అజయ్ భూపతి

13-10-2021 Wed 10:24
  • ఈ కథ ప్రేమకు అర్థం చెబుతుంది 
  • నిజమైన స్నేహానికి నిర్వచనం చెబుతుంది
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతుంది 
  • తప్పకుండా పెద్ద హిట్ కొడుతుంది
Mahasamudram movie update

అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా రూపొందింది. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా కనిపించనున్నారు. ఇక కథానాయికలుగా అదితీరావు - అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో అజయ్ భూపతి బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో అజయ్ భూపతి మాట్లాడుతూ .. " స్నేహం చేసినప్పుడు అవతలవారు ఒక్కోసారి తప్పు చేసినా స్వీకరించగలగాలి. ప్రేమలో ఎదురయ్యే పరిణామాలను అంతేలా స్వీకరించగలగాలి అనేదే ఈ కథ. రావు రమేశ్ - జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకి మరింత బలంగా నిలుస్తాయి.

ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర 'మహా'. ఈ పాత్రను గురించి రాస్తున్నప్పుడే సమంతను అనుకున్నాను. కానీ కుదరలేదు. అందువలన అదితీరావును తీసుకున్నాను. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ఈ పండగకి తప్పకుండా పెద్ద హిట్ కొడుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.