సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

13-10-2021 Wed 07:23
  • విజయ్ కి జంటగా మరోసారి కీర్తి సురేశ్ 
  • 'సలార్'లో ఛాన్స్ కొట్టేసిన 'ఖిలాడి' భామ
  • చివరి దశకు 'రామారావు ఆన్ డ్యూటీ'  
Keerti Suresh to be cast opposite Vijay third time

*  అందాలతార కీర్తి సురేశ్ మూడోసారి తమిళ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ కనిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో కథానాయిక పాత్రకు కీర్తి సురేశ్ ని తీసుకుంటున్నట్టు తాజా సమాచారం.
*  ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో మరో నాయికగా 'ఖిలాడి' ఫేమ్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
*  రవితేజ కథానాయకుడుగా నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే చివరి షెడ్యూలును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ కొంత షూటింగ్ చేశాక, రెండు పాటలను యూరప్ లో చిత్రీకరిస్తారు.