ఏపీ ఎడ్ సెట్ ఫలితాల విడుదల

  • ఫలితాలను విడుదల చేసిన కన్వీనర్ 
  • ఈ ఏడాది ఎడ్ సెట్ కు 15,638 మంది దరఖాస్తు
  • పరీక్షకు హాజరైన వారి సంఖ్య 13,619
  • 13,428 మంది అర్హత పొందారన్న కన్వీనర్
AP EDCET results released

ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఎడ్ సెట్ కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు.

ఈ ఏడాది ఎడ్ సెట్ కు 15,638 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 13,619 మంది హాజరయ్యారు. ఎడ్ సెట్ లో 13,428 మంది అర్హత సాధించినట్టు విశ్వేశ్వర్ రావు వెల్లడించారు. మొత్తమ్మీద 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత పొందారని తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారం మేరకు 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

More Telugu News