Mahati Swarasagar: త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు

Mahati Swarasagar will tie the knot with Sanjana Kalamanje
  • మణిశర్మ ఇంట్లో పెళ్లిసందడి
  • గాయని సంజనా కలమంజేతో మహతి స్వరసాగర్ పెళ్లి
  • ఈ నెల 24న చెన్నైలో వివాహం
  • ఈ నెల 29న హైదరాబాదులో రిసెప్షన్
టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు మహతి స్వరసాగర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. మహతి స్వరసాగర్ వివాహం గాయని సంజనా కలమంజేతో ఈ నెల 24న జరగనుంది. ఉదయం 10.30 గంటలకు చెన్నై టీ-నగర్ లోని అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఈ సెలబ్రిటీ పెళ్లి జరగనుంది. అనంతరం ఈ నెల 29న హైదరాబాదు గోల్కొండ రిసార్ట్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

ఇటీవలే స్వరసాగర్, సంజనాల నిశ్చితార్థం జరిగింది. సంజనా కలమంజే స్వస్థలం కర్ణాటకకు చెందిన ఉడుపి. వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది.
Mahati Swarasagar
Sanjana Kalamanje
Wedding
Manisharma
Tollywood

More Telugu News