Israel: ఇజ్రాయెల్‌లో 1,500 ఏళ్ల క్రితం నాటి మ‌ద్యం త‌యారీ కేంద్రం బ‌య‌ట‌ప‌డిన వైనం.. ఫొటోలు ఇవిగో

Archeologists in Israel have discovered largest wine complex
  • యావ్నే పట్టణం సమీపంలో గుర్తింపు
  • గ్రీకు చక్రవర్తి బైజాంటైన్‌ కాలం నాటిదన్న ప‌రిశోధ‌కులు
  • రెండేళ్లుగా అక్క‌డ తవ్వకాలు
  • గిడ్డంగులు, బట్టీలు, జాడీలు గుర్తింపు
ఇజ్రాయెల్‌లో టెల్‌ అవీవ్‌కు దక్షిణం వైపున ఉండే యావ్నే పట్టణం సమీపంలో 1500 క్రితం నాటి భారీ మ‌ద్యం త‌యారీ కేంద్రాన్ని పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. అక్క‌డ జ‌రిపిన త‌వ్వ‌కాల్లో ఇది బ‌య‌ల్పడింద‌ని తెలిపారు. ఇది గ్రీకు చక్రవర్తి బైజాంటైన్‌ కాలం నాటిదని వివ‌రించారు. రెండేళ్లుగా అక్క‌డ తవ్వకాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు.

అప్ప‌ట్లో ఇక్కడ భారీస్థాయిలో మద్యం తయారీ జరిగినట్లు గుర్తించామ‌ని తెలిపారు. ఈ కాంప్లెక్స్‌లో ఐదు మద్యం తయారీ యూనిట్లతో పాటు, మ‌ద్యాన్ని నిల్వ చేసేందుకు గిడ్డంగులు, బట్టీలు, జాడీలు వంటివాటిని గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు వివ‌రించారు. అప్ప‌ట్లో యావ్నేలో ప్ర‌తి ఏడాది 5.2 లక్షల గాలన్లకు పైగా మద్యం తయారయ్యేదని తెలుస్తోంద‌ని చెప్పారు.
Israel
wine

More Telugu News