nagababu: రాజీనామా లేఖలో.. 'మా' స‌భ్యుల‌పై నాగ‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు

  • ఇటీవలి కాలంలో మార్పులు
  • ఈ అసహ్యకరమైన మార్పులే  ఆశ్చర్యానికి గురిచేశాయి
  • నాకు క‌నువిప్పు కలిగించాయి
  • బలగం, ధన ప్రభావంతో మా సభ్యులు దారుణంగా దిగజారిపోయారు
naga babu on MAA Elections 2021 Results

మూవీ ఆర్టిస్ట్‌స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోవడంతో, ఆయనకు మ‌ద్ద‌తు తెలిపిన సినీన‌టుడు నాగ‌బాబు అసోసియేష‌న్‌కు రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు నిన్న ఆయ‌న రాజీనామా లేఖ‌ను పంపారు. దాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. ఆ లేఖలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన 'మా' తీరును తాను ఎల్ల‌ప్పుడూ అభిమానించేవాడినని నాగ‌బాబు చెప్పారు. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ఆ అసోసియేష‌న్ ఓ సొంతిల్లుగా నిలిచేదని చెప్పారు.  

అయితే, ఇటీవలి కాలంలో మా అసోసియేష‌న్ సభ్యుల్లో అటు కళాకారులుగా, ఇటు మనుషులుగా ఊహించ‌ని మార్పులు వచ్చాయని ఆయ‌న అన్నారు. ఈ అసహ్యకరమైన మార్పులే త‌న‌ను ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. తనలాంటి వారికి ఎన్నిక‌లు కనువిప్పు కలిగించాయని తెలిపారు.

బలగం, ధన ప్రభావంతో మా సభ్యులు దారుణంగా దిగజారిపోయార‌ని చెప్పుకొచ్చారు. ఇలాంటి వారి కారణంగానే తాను అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్ ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి  అని, అలాంటి వ్యక్తి వెంటే తాను ఎల్లప్పుడూ నిలబడి ఉంటానని తెలిపారు. మా భవిష్యత్‌పైనే తాను ఆందోళన చెందుతున్నాన‌ని చెప్పారు.
         

More Telugu News