దేశంలో భారీగా త‌గ్గిన కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య

12-10-2021 Tue 10:25
  • నిన్న‌ 14,313 కేసుల నిర్ధార‌ణ
  • మొత్తం కేసుల సంఖ్య‌ 3,39,85,920
  • మృతుల సంఖ్య మొత్తం 4,50,963
  • కేర‌ళ‌లోనే 6,996 క‌రోనా కేసులు
corona bulletin in inida
దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న‌ కొత్తగా 14,313 కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,39,85,920కు చేరింది. నిన్న 181 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 26,579 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,20,057కు పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో  2,14,900 మంది క‌రోనాకు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,50,963కి చేరింది. నిన్న 65,86,092 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 95,89,78,049కి చేరింది. నిన్న ఒక్క కేర‌ళ‌లోనే 6,996 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, ఆ రాష్ట్రంలో నిన్న‌ 84 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.