ఉండ‌వ‌ల్లి చేసిన వ్యాఖ్య‌ల వీడియోను పోస్ట్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

12-10-2021 Tue 09:56
  • ఏపీలో ఆర్థిక ప‌రిస్థితిపై ఉండ‌వ‌ల్లి విమ‌ర్శ‌లు
  • ఉండవల్లి గారి లాంటి రాజకీయ ఉద్ధండులు విమ‌ర్శించార‌న్న‌ ప‌వ‌న్
  • పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని ట్వీట్
pawan slams ycp
'ఉండవల్లి గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు' అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెల‌కొన్న‌ ఆర్థిక ప‌రిస్థితుల‌పై ఉండ‌వ‌ల్లి తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ వీడియో ద్వారా గుర్తు చేశారు.

రాజమహేంద్రవరంలో తాజాగా మీడియా స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక పరిస్థితి దిగ‌జారి పోయింద‌ని విమ‌ర్శించారు. ఇటువంటి ప‌రిస్థితి ఏపీలో ఎన్న‌డూ లేద‌ని, అసలు ప్ర‌భుత్వం ఏం చేస్తోందో ప్ర‌జ‌ల‌కు తెలియ‌నివ్వ‌కూడ‌ద‌న్న ధోర‌ణిలో స‌ర్కారు ఉంద‌ని అన్నారు.

ప్ర‌భుత్వంలో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని ఆయ‌న తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఆయ‌న‌ ఆరోపించారు. ఎంతో మంది సలహాదారులు ఉన్నప్ప‌టికీ ఆర్థిక ప‌రంగా దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమని ఆయ‌న అన్నారు.