డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా హనుమకొండ వాసి రాము అబ్బగాని

12-10-2021 Tue 09:19
  • ఉత్తర్వులు జారీ చేసిన విదేశాంగ శాఖ
  • హనుమకొండలోని మర్కాజీ పాఠశాలలో ప్రాథమిక విద్య
  • 2001లో ఐఎఫ్ఎస్‌కు ఎంపిక
Ramu Abbagani appointed as the next Ambassador of India to the Dominican Republic

హనుమకొండకు చెందిన 2001 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి రాము అబ్బగాని డొమినికన్ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. రామును డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా నియమిస్తూ విదేశాంగ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

 హనుమకొండలోని మర్కాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన రాము.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు జైపూర్‌లో నాబార్డ్ మేనేజర్‌గా పనిచేశారు. 2001లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అనంతరం జపాన్, థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయాల్లోనూ సేవలందించారు.