Pawan Kalyan: 17న అలయ్ బలయ్.. పవన్‌ను ఆహ్వానించిన బండారు దత్తాత్రేయ కుమార్తె

Pawan kalyan invited to alay balay on 17th october
  • 16 ఏళ్లుగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న దత్తాత్రేయ
  • నెక్లస్ రోడ్డులోని జలవిహార్‌లో కార్యక్రమం
  • పవన్‌కు ఆహ్వానపత్రిక అందించిన విజయలక్ష్మి
ఈ నెల 17న హైదరాబాద్, నెక్లస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పిలుపు అందింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలతోపాటు, ఇతర ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు.

నిన్న పవన్‌ను కలిసిన విజయలక్ష్మి ఆహ్వాన పత్రిక అందించి తప్పకుండా రావాల్సిందిగా కోరారు. బండారు దత్తాత్రేయ గత 16 సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఆయన కుమార్తె ఆధ్వర్యంలో అలయ్ బలయ్ జరగబోతోంది.
Pawan Kalyan
Janasena
Alay Balay
Bandaru Dattatreya
Vijayalakshmi

More Telugu News