Mohan Babu: తన కుమారుడు మంచు విష్ణు విజయం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మోహన్ బాబు

Mohan Babu talks to media after Manchu Vishnu victory
  • మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం
  • హర్షం వ్యక్తం చేసిన మోహన్ బాబు
  • తనను రెచ్చగొట్టాలని చూశారని వెల్లడి
  • కానీ ఓపిక పట్టానని వివరణ
మా అధ్యక్షుడిగా తన కుమారుడు మంచు విష్ణు విజయం సాధించడం పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందించారు. మంచు విష్ణు ప్యానెల్ మీడియా సమావేశంలో మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా ఎన్నికల సందర్భంగా తనను రెచ్చగొట్టాలని చూశారని, కానీ ఓపికగా భరించానని వెల్లడించారు.

తాను 17 ఏళ్ల కిందట మా అధ్యక్షుడిగా చేశానని, ఇప్పుడు తన బిడ్డ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడని అన్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే... నాలుగు అడుగులు వేగంగా ముందుకు దూకుతుంది అని అర్థమని వ్యాఖ్యానించారు.

మా నూతన కార్యవర్గం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి, సినీ రంగ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలని మోహన్ బాబు సూచించారు. గతంలో సీఎంలను సన్మానించేవాళ్లమని, ఇప్పుడు కూడా ఆ ఆనవాయతీని పాటించి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సన్మానించాలని సూచించారు. 
Mohan Babu
Manchu Vishnu
MAA Elections
Tollywood

More Telugu News