తిరుమల బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్

11-10-2021 Mon 18:30
  • తిరుపతిలో ముగిసిన పర్యటన
  • తిరుమల విచ్చేసిన సీఎం జగన్
  • స్వాగతం పలికిన వైవీ, తదితరులు
  • స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ
CM Jagan arrives Tirumala

సీఎం జగన్ తిరుపతిలో కార్యక్రమాలు ముగించుకుని తిరుమల చేరుకున్నారు. సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. సీఎం జగన్ తిరుమల పర్యటనలో తొలిగా బేడీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధరించివచ్చిన సీఎంకు వేదపండితులు తలపాగా చుట్టారు. ఆపై మేళతాళాలు, వేదమంత్రాల నడుమ పట్టు వస్త్రాలను తలపై మోసుకుంటూ స్వామివారికి సమర్పించారు.