IPL: హర్షల్ పటేల్ కు ఐపీఎల్​ రికార్డ్ ను బ్రేక్ చేసే చాన్స్

  • 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ సాధించిన ఆర్సీబీ బౌలర్
  • 2013లో 32 వికెట్లు తీసిన సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావో
  • హర్షల్ మరో రెండు వికెట్లు తీస్తే రికార్డు సమం
  • మూడు వికెట్లు సాధిస్తే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డ్
Harshal Patel On Verge Of Breaking Highest Wicekts In IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ గొప్ప రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు ఆర్సీబీ బౌలింగ్ సంచలనం హర్షల్ పటేల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఉరకలేసే ఉత్సాహంతో దానిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం 30 వికెట్లు తీసి టాప్ లో పర్పుల్ క్యాప్ తో ఉన్న అతడు.. మరో 3 వికెట్లు తీస్తే ఇప్పటిదాకా ఐపీఎల్ ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టిస్తాడు.

ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వేన్ బ్రావో పేరిట ఆ రికార్డ్ ఉంది. సీఎస్కే తరఫున 2013 సీజన్ లో అతడు 32 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ లో హర్షల్ మరో రెండు వికెట్లు తీస్తే.. బ్రావో రికార్డును సమం చేస్తాడు. మూడు పడగొడితే.. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మంచి ఊపు మీదున్న హర్షల్ పటేల్ కు ఇప్పుడు ఆ మూడు వికెట్లు తీయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.

More Telugu News