KCR: చినజీయర్ స్వామి ఆశ్రమానికి సతీసమేతంగా సీఎం కేసీఆర్

  • పూర్ణ కుంభాలతో స్వాగతం పలికిన వేద పండితులు
  • రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సీఎం
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విగ్రహావిష్కరణ
CM KCR Visits China Jeeyar Ashram

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా ఆయన శంషాబాద్ లోని  ముచ్చింతల్ లో ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. కేసీఆర్ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ‘సమతా మూర్తి’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చినజీయర్ స్వామి ఇప్పటికే ఆహ్వానించారు. చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి.

  • Loading...

More Telugu News