'అనుభవించు రాజా' టైటిల్ సాంగ్ రిలీజ్!

11-10-2021 Mon 11:16
  • రాజ్ తరుణ్ నుంచి 'అనుభవించు రాజా'
  • సంగీత దర్శకుడిగా గోపీ సుందర్
  • భాస్కరభట్ల సాహిత్యం 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు         
Anubhavinchu Raja title song released

రాజ్ తరుణ్ హీరోగా గవిరెడ్డి శ్రీను దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ - శ్రీవెంకటేశ్వర సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాత్రపరంగా డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా" అంటూ ఈ పాట సాగుతోంది.

"అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ .. కల్లుకైనా కనికరించవా .. మందుకైనా మన్నించవా" అంటూ ఈ పాట ద్వారా హీరో పాత్ర తీరు తెన్నులు చెప్పే ప్రయత్నం చేశారు. మొలతాడైనా మనతో రాదు .. అవకాశం ఉన్నప్పుడే అన్నీ అనుభవించేయ్ అంటూ భాస్కరభట్ల అందించిన సాహిత్యాన్ని రామ్ మిరియాల ఆలపించాడు. గ్రామీణ నేపథ్యంలో .. జాతర వాతావరణంలో పాట మాంచి హుషారుగా కొనసాగింది.