Bandi Sanjay: అటువంటి వారికి సరైన గుణపాఠం చెప్పారు: 'మా' ఫ‌లితాల‌పై బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు

bandi sanjay on maa results
  • ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు
  • జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించారు
  • దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గుంపున‌కు బుద్ధి చెప్పారు
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన నేప‌థ్యంలో ఈ విష‌యంపై బీజేపీ తెలంగాణ‌ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎదురుచూశారని ఆయ‌న ట్వీట్ చేశారు.

చివరికి ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని ఆయ‌న చెప్పారు. అందరికీ అభినందనలు అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యానళ్ల విజేతలకు బండి సంజ‌య్‌ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గుంపున‌కు మద్దతు పలికిన వారికి ఇది సరైన గుణపాఠం అని ఆయ‌న చెప్పారు.
Bandi Sanjay
BJP
MAA

More Telugu News