ఛేజింగ్ సీన్స్ కి రెడీ అవుతున్న 'భీమ్లా నాయక్'

11-10-2021 Mon 10:30
  • షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
  • స్క్రీన్ ప్లే .. మాటలు అందించిన త్రివిక్రమ్
  • ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్
  • జనవరి 12వ తేదీన విడుదల
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఛేజింగ్ సీన్ ను ప్లాన్ చేశారట. ఈ సన్నివేశాన్ని హైదరాబాద్ -  రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా ఈ సీన్ లో ఉంటాడని అంటున్నారు. ఇంటర్వెల్ కి ముందొచ్చే ఈ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - మాటలు త్రివిక్రమ్ అందించడం విశేషం. పవన్ - త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కోరికమేరకే త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - మాటలు అందించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.