Teenmaar Mallanna: ఢిల్లీలో అమిత్ షాను కలిసిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసుల వివరాలతో కూడిన లేఖ అందజేత

Teenmaar Mallanna wife Mathamma met with Amit Shah
  • ఎంపీ అరవింద్, సోదరుడితో కలిసి ఢిల్లీలో షాను కలిసిన మాతమ్మ
  • ఇప్పటి వరకు 35 కేసులు నమోదయ్యాయని ఫిర్యాదు
  • ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నపై కేసులు ఒకదాని తర్వాత ఒకటిగా నమోదవుతున్న వేళ.. ఆయన భార్య మాతమ్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ అరవింద్ కుమార్, సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆమె అమిత్ షాను కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని, ఇప్పటి వరకు 35 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను అందించారు. కాగా, మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు ఇటీవల ఆయన చానల్ క్యూ న్యూస్ ప్రకటించింది.
Teenmaar Mallanna
Q News
Mathamma
Amit Shah

More Telugu News