Corona Virus: జాగ్రత్తలు హుష్‌కాకి.. మాస్కుల మాటెత్తని జనం!

  • ’లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడి
  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తున్నది 13 శాతమే
  • భౌతిక దూరం పాటిస్తున్న వారు 6 శాతం మందే
people forgotten wearing face masks

కరోనా మహమ్మారి దేశంలో ఇంకా విజృంభిస్తూనే ఉంది. ప్రతి రోజూ వేలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా పూర్తికాలేదు. కానీ దేశం నుంచి కరోనా వెళ్లిపోయినట్టు ప్రజలు అప్పుడే మాస్కులను పక్కనపెట్టేశారు. మరీ ముఖ్యంగా పండుగల వేళ, అందరూ ఒక్క చోటికి చేరే వేళ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన చోట బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు, ప్రయాణాలలోను ఇప్పుడు మాస్కులు ధరించేవారు 13 శాతమేనని, భౌతిక దూరం పాటిస్తున్న వారైతే మరీ తక్కువ (6 శాతం) అని కమ్యూనిటీ ఆధారిత ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ వివరించింది. దేశంలోని 366 జిల్లాల్లో 65 వేల మంది నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ నెలలో లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 29 శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తుండగా, 11 శాతం మంది భౌతిక దూరం పాటించారు. 

More Telugu News