Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన కాసేపటికే.. నాగబాబు షాకింగ్ నిర్ణయం

  • ‘మా’ సభ్యత్వానికి రాజీనామా
  • ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన
  • అలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేదన్న నాగబాబు
Actor Nagababu Resigns from MAA

హోరాహోరీగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన కాసేపటికే సీనియర్ నటుడు నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకుచిత మనస్తత్వం, ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతున్న మా అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజీనామా లేఖను 48 గంటల్లో ‘మా’ కార్యాలయానికి పంపుతానని పేర్కొన్నారు. ఆషామాషీగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, పలు విధాలుగా ఆలోచించిన తర్వాత పూర్తి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాగబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News