సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

11-10-2021 Mon 07:27
  • చోళరాణి కోసం రంగంలోకి త్రిష!
  • నెలాఖరు నుంచి 'ఆహా'లో 'లవ్ స్టోరీ'
  • డబ్బింగ్ చెబుతున్న అజయ్ దేవగణ్    
Trisha starts dubbing for Ponnian Selvan

*  చాలా రోజుల తర్వాత అందాలతార త్రిష మళ్లీ డబ్బింగ్ చెబుతోంది. సాధారణంగా తన సినిమాలకు త్రిష డబ్బింగ్ చెప్పదు. ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాలకు మాత్రమే డబ్బింగ్ చెప్పిన త్రిష, ఇప్పుడు మణిరత్నం పట్టుబట్టడం వల్ల 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి గాను డబ్బింగ్ చెబుతోంది. ఇందులో ఆమె చోళరాణి కుందవై పాత్రను పోషించింది.
*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. 'ఆహా' ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.
*  రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ డబ్బింగ్ మొదలెట్టాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తిచేసిన విషయం తెలిసిందే. వచ్చే జనవరి 7న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.