Srikanth: నేను గెలిచి ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధగా ఉంది: శ్రీకాంత్

Srikanth feels unhappy on Prakash Raj defeat
  • 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమి
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన శ్రీకాంత్
  • విష్ణుకు అభినందనలు తెలిపిన వైనం
  • జయాపజయాలను సినిమాతో పోల్చిన శ్రీకాంత్
'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం పట్ల నటుడు శ్రీకాంత్ స్పందించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన శ్రీకాంత్ తన ప్రత్యర్థి బాబూ మోహన్ పై నెగ్గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను నమ్మారు కాబట్టే ఓటు వేసి గెలిపించారని అన్నారు. అయితే తాను గెలిచినప్పటికీ ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు.

'మా' కోసం తాము ఎంతో చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నామని, గత రెండు నెలలుగా తాము కలిసి ప్రయాణించామని పేర్కొన్నారు. తమ బృందం మా పీఠం ఎక్కలేకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమని అన్నారు. ఇది కూడా ఓ సినిమా అనుకుని వెళ్లిపోవడమేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు.
Srikanth
Prakash Raj
MAA Elections
Tollywood

More Telugu News