Chiranjeevi: ఒక్క పదవి కోసం ఇంత లోకువ కావడం అవసరమా?: చిరంజీవి

  • హైదరాబాదులో పెళ్లిసందD ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథులుగా చిరంజీవి, వెంకటేశ్
  • ప్రసంగించిన చిరంజీవి
  • మా ఎన్నికల తీరుపై స్పందన
Chiranjeevi comments on Tollywood issues

రోషన్ శ్రీలీల జంటగా నటించిన పెళ్లిసందD చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. చిరంజీవి ప్రసంగిస్తూ, వెంకటేశ్ తో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. తన సినిమా బాగుంటే వెంకటేశ్ అభినందిస్తాడని, వెంకటేశ్ సినిమా బాగుంటే "ఏంచేశావయ్యా వెంకీ" అని తాను అభినందిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా అని వ్యాఖ్యానించారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. పదవుల కోసం అందరికీ లోకువ అయ్యేలా వ్యవహరిస్తున్నారని, ఒకరిని అనడం, అనిపించుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. తాను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించడంలేదని, ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. మన ఆధిపత్యం చూపించుకోవడానికి ఎదుటివారిని కించపర్చాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

అసలు చిత్ర పరిశ్రమలో వివాదం ఎక్కడ ప్రారంభమైందో అందరూ తెలుసుకోవాలని, ఆ వివాదం ప్రారంభించిన వ్యక్తిని గుర్తించాలని పేర్కొన్నారు. హోమియోపతి వైద్య విధానంలో మూలకారణాన్ని బట్టి చికిత్స చేస్తారని, ఇక్కడ అదే సూత్రం వర్తింపజేయాలని పిలుపునిచ్చారు. వివాదానికి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయాలన్నారు. చిన్న చిన్న గొడవలతో బజారుకెక్కి మీడియా వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని అన్నారు.

More Telugu News