'మా' ఎన్నికల్లో నేను చెప్పిందే నిజమైంది: టీడీపీ నేత సోమిరెడ్డి

10-10-2021 Sun 21:39
  • ప్రకాశ్ రాజ్ ఓ కామెంట్ కారణంగా ఓడిపోయాడన్న సోమిరెడ్డి
  • సీనియర్ల ఆశీస్సులు అవసరంలేదన్నాడని వెల్లడి
  • విష్ణు వినయవిధేయతలే విజయానికి కారణమని వివరణ
  • విష్ణుకు అభినందనలు తెలుపుతూ సోమిరెడ్డి ట్వీట్
TDP leader Somireddy opines on MAA Elections

'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం అవుతుందని వారం కిందట మిత్రులతో చెప్పానని సోమిరెడ్డి వెల్లడించారు. సీనియర్ల ఆశీస్సులు తనకు అక్కర్లేదని ఇచ్చిన స్టేట్ మెంట్ తో ప్రకాశ్ రాజ్ తన ఓటమికి తానే బాటలు వేసుకున్నాడని పేర్కొన్నారు.

ఇక, మంచు విష్ణు వినయవిధేయతలే ఆయన విజయానికి నాంది అవుతున్నాయని కూడా తాను చెప్పానని సోమిరెడ్డి వివరించారు. ఈ రోజు అదే నిజమైందని తెలిపారు. విజేతగా నిలిచిన విష్ణుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. విష్ణుకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.