Prithwi Shaw: పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్... రాణించిన పంత్, హెట్మెయర్... ఢిల్లీ భారీ స్కోరు

  • ఐపీఎల్ లో క్వాలిఫయర్-1
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 రన్స్ చేసిన ఢిల్లీ
  • 34 బంతుల్లో 60 రన్స్ చేసిన పృథ్వీ షా
  • హేజెల్ వుడ్ కు 2 వికెట్లు
Delhi registered huge total against Chennai Super Kings

చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపీఎల్ క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ పృథ్వీ షా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మెయర్ కూడా దూకుడుగా ఆడడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెట్మెయర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 37 పరుగులు నమోదు చేశాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ (7), శ్రేయాస్ అయ్యర్ (1) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ కు 2 వికెట్లు లభించాయి. జడేజా, మొయిన్ అలీ, బ్రావో తలో వికెట్ తీశారు.

More Telugu News