హోరాహోరీ పోరులో మంచు విష్ణుదే విజయం

  • 107 ఓట్ల తేడాతో విజయం 
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్
  • ఉపాధ్యక్షుడిగా మాదాల రవి
  • రికార్డు స్థాయిలో ఓటింగ్
Manchu Vishnu wins MAA Presidential elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. మా అసోసియేషన్‌లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ పడిన జీవితా రాజశేఖర్ 27 ఓట్ల తేడాతో రఘుబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. మాదాల రవి మంచు విష్ణు ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు. ఇక, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీపడిన శ్రీకాంత్.. బాబూమోహన్‌పై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణు ప్యానల్ నుంచి కోశాధికారి పదవికి పోటీ చేసిన శివబాలాజీ.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 67 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కార్యవర్గ సభ్యులుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత ఎన్నిక కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ, సురేశ్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి విజయం సాధించారు.

More Telugu News