'మా' ఎన్నికల్లో సంచలనం... రఘుబాబు చేతిలో జీవిత ఓటమి

10-10-2021 Sun 20:52
  • కొనసాగుతున్న 'మా' ఓట్ల లెక్కింపు
  • ప్రధాన కార్యదర్శిగా పోటీ పడిన జీవిత
  • జీవితపై రఘుబాబుదే పైచేయి
  • ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్ కు కోశాధికారి పదవి
Jeevitha lost to Raghubabu in MAA Elections

'మా' ఎన్నికల్లో సంచలన ఫలితం నమోదైంది. 'మా' ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవిత ఓటమి పాలయ్యారు. ఆమెపై మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన రఘుబాబు విజయం సాధించారు. ఇప్పటికే కీలకమైన కోశాధికారి పదవి కూడా మంచు విష్ణు ప్యానెల్ పరమైంది. శివబాలాజీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన నాగినీడుపై నెగ్గారు.

అటు, 'మా' అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాంత్ తన ప్రత్యర్థి బాబూ మోహన్ పై ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాంత్... ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున పోటీ చేయడం తెలిసిందే.