'మా' ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపు: ట్రెజరర్ గా శివబాలాజీ విజయం

10-10-2021 Sun 20:25
  • ముగిసిన ఈసీ ఓట్ల లెక్కింపు
  • కొనసాగుతున్న ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపు
  • నాగినీడుపై నెగ్గిన శివబాలాజీ
  • జీవితపై రఘుబాబుకు స్వల్ప ఆధిక్యం
Siva Balaji wins as MAA Treasurer
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈసీ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. 'మా' కోశాధికారి (ట్రెజరర్)గా శివబాలాజీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన శివబాలాజీ... ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన నాగినీడుపై నెగ్గారు. ఇక, జీవితపై విష్ణు ప్యానెల్ అభ్యర్థి రఘుబాబు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. జీవిత 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయడం తెలిసిందే.